Search
Wednesday 26 September 2018
  • :
  • :

హీరోయిన్ బ్రేకప్‌తో హీరోకు ‘తిక్క’

Thikkaసాయిధరమ్‌తేజ్, లారిస్సా బోనేసి జంటగా శ్రీ వెంకటేశ్వరా మూవీ మేకర్స్ బ్యానర్‌పై సునీల్‌రెడ్డి దర్శకత్వంలో సి.రోహన్‌కుమార్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క’. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. దిల్‌రాజు గౌరవ దర్శకత్వం వహించారు. హీరో సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ “ఇది నా నాలుగవ చిత్రం. గత ఏడాది జూలైలో ఈ సినిమా కథ విన్నాను. కొత్తగా అనిపించింది. ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ అవ్వడంతో హీరోకు తిక్క రేగుతుంది. అందుకే సినిమాకు ‘తిక్క’ అనే టైటిల్ పెట్టారు. తన ప్రేమను తిరిగి ఎలా సాధించాడు అనే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి”అని చెప్పారు. దర్శకుడు సునీల్‌రెడ్డి మాట్లాడుతూ “ఎవరి జీవితానికి వాడే హీరో. కానీ ఈ సినిమాలో హీరో లైఫ్‌కు తనే విలన్. ఇదొక హిలారియస్ కామెడీతో కూడిన ఫన్ ఫిల్మ్. ఆగస్టు 10 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. డిసెంబర్‌లో షూటింగ్ పూర్తిచేసి జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించి ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం”అని చెప్పారు. నిర్మాత సి.రోహన్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ “ఇది నా మొదటి సినిమా. సినిమా కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, హీరో సునీల్, చిత్ర హీరోయిన్ లారిస్సా బోనేసి, నవీన్ విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీః జ్ఞానశేఖర్ వి.ఎస్., మ్యూజిక్ డైరెక్టర్‌ః ఎస్.ఎస్.తమన్, ఎడిటర్‌ః కార్తీక శ్రీనివాస్, కథః షేక్ దావూద్, డైలాగ్స్‌ః లక్ష్మీభూపాల్.

Comments

comments