Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

1నుంచి తపాలా బ్యాంకు సేవలు

Post Payments Bank on September 1

రాష్ట్ర వ్యాప్తంగా 115 యాక్సిస్ కేంద్రాల్లో ఐపిపిబి సర్వీసులు 

మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లను (ఐపిపిబి) సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 23 సర్కిళ్లలో 115 యాక్సెస్ కేం ద్రాల్లో ఐపిపిబి సేవలను ప్రారంభించనున్నా రు. హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వర భవన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్.నరసింహన్ ఐపిపిబి బ్యాంక్ ప్రారంభించగా, వివిధ సర్కిళ్ల పరిధిలో ఎంపీలు, ప్రజాప్రనిథులు ప్రారంభిస్తారని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్ సదన్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం మీడియా సమావేశంలో చంద్రశేఖర్ వివరాలను వెల్లడించారు.

తొలుత ఐపిపిబిని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తారని, దీనిని అన్ని రాష్ట్రాలలో లైవ్ టెలికాస్ట్‌ను వీక్షిస్తామని, ఆతర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రారంభోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రస్తుత ఏడాది డిసెంబర్ 31 నాటికి అన్ని పోస్ట్ ఆఫీసులలో ఐపిపిబి యాక్సెస్ కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం పోస్టాఫీసులో రూ.40 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని, రూ.17 కోట్లు సేవింగ్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని ఆయన వివరించారు. దేశ వ్యాప్తంగా 650 పోస్టాఫీసు శాఖలు ఉండగా, 3250 యాక్సెస్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ బ్యాంక్ సేవలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నాయని, ఇది ప్రపంచంలోనే పెద్ద బ్యాంక్‌గా నిలువబోతుందని చెప్పారు.

ఇంటికే బ్యాంక్ సేవలు
పోస్ట్ బ్యాంక్‌లో ఖాతాదార్ల ఇంటికే సేవలను అందించనున్నారు. ప్రతి రోజూ రూ.5వేల వరకు డిపాజిట్స్ లేదా విత్‌డ్రా సేవలను ఖాతాదార్ల ఇంటి వద్దనే అందనున్నాయి. ఇంటి వద్దకు వచ్చే సేవలను గరిష్టంగా రూ. 5వేలకు పరిమితం చేశారు. పైగా ఈ సేవలకు రూ.15 నుంచి రూ.35 రూపాలయల వరకు సర్వీసు చార్జీలను వసూలు చేయనున్నారు. పోస్ట్‌మెన్లకు ‘మైక్రో ఎటిఎం’ యంత్రాన్ని ఇచ్చి వాటి ద్వారా ఖాతాలో డబ్బుల డిపాజిట్స్, విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. తొలుత 30మంది పోస్ట్‌మెన్లకు ఈ సదుపాయాన్ని కల్పించనున్నారు. ఖాతాదార్ల సౌకర్యార్థం టోల్‌ఫ్రీ నెంబర్‌కు మిస్డ్‌కాల్ చేస్తే వెంటనే తిరిగి కాల్ చేసి కావాల్సిన సేవలను అందించనున్నారు. సేవింగ్‌అకౌంట్స్‌లో కనీసంగా రూ. 100ల నుంచి గరిష్టంగా ఒక లక్ష రూపాయాలను డిపాజిట్స్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

బ్యాంక్‌లో ఖాతా తెరువాలనుకునే వారు తమ ఆధార్‌కార్డు నెంబర్, ఫోన్‌నెంబర్ ఆధారంగా అప్పటికప్పుడే ఖాతాను తెరిచే వెసులుబాటు కల్పించినట్లు చంద్రశేఖర్ తెలిపారు. ‘క్యూ ఆర్ ’ కార్డును కూడా అందజేయనున్నారు. దీని ఆధారంగా వివిధ షాపింగ్ మాల్స్‌లలో నగదు రహిత చెల్లింపులకు కూడా అవకాశం కల్పించనున్నారు.

Comments

comments