Home మెదక్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.1.55 కోట్ల మంజూరు

సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.1.55 కోట్ల మంజూరు

1.55 Crore Release For Sub Stations Bulding Works

మన తెలంగాణ/హుస్నాబాద్ రూరల్ : మండలంలోని రామవరం గ్రామంలో 33/ 11కెవి సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.1.55 కో ట్లు మంజూరు చేసినట్లు మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. సిఎం కెసిఆర్ విద్యుత్ రంగం లో విప్లవాత్మక మార్పు తెచ్చారని దేశం లో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. రైతు క ష్టం తెలిసిన వాడిగా రైతు కుటుంబానికి చెందిన సిఎం కెసిఆర్ రైతులకు రేయింబవల్లు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాల నే లక్షంతో ముందుకు పోతున్నారని అందుకే గ్రామాలలో సబ్ స్టేషన్‌ల ని ర్మాణాలు చేసడుతున్నట్లు తెలిపారు. రామవరం సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు త్వరలోనే టెండర్‌ల ప్రక్రి య మెదలు పెట్టి పనులు ప్రా రంభిస్తామని తెలిపారు.
-హామీ ఇచ్చిన రెండు రోజుల్లో నే మంజూరు : ఇటీవల హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కా ర్యక్రమాలకు హాజరైన మంత్రి తన్నీరు హరీశ్‌రావును రామవరంలో స బ్ స్టేషన్ మంజూరు చేయాలని రైతులు కోరగా హామీ ఇ చ్చిన ఆయన రెండు రోజుల్లో నే నిధులు మంజూరు చేసి అభివృద్ధికి నిదర్శనం హరీశ్‌రావు అని నిరూపించుకన్నారు.
గ్రామ ప్రజల్లో ఆనందం : సబ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి నిధులు మంజూ రు చేయడం పట్ల గ్రామ రైతు లు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నా రు. హామీ ఇచ్చివెల్లిన నాయకు లను చూశాం. గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు మంత్రి హరీశ్‌రావుకు, స్థానిక ఎం ఎల్‌ఎ సతీష్ కుమార్‌కు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.