Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఆత్మాహుతి దాడిలో 10 మంది మృతి

10 died in Suicide Attack at Afghanistan

ఆఫ్ఘనిస్థాన్ : జలాలాబాద్‌లోని నాంగర్‌హర్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో పది మంది పౌరులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడిని రాష్ట్ర గవర్నర్ ప్రతినిధి అతాహుల్లా ధ్రువీకరించారు. ఈ దాడులకు పాల్పడిందెవరన్నది తెలియరాలేదు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో పార్కింగ్ చేసిన వాహనాలతో పాటు పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ ఆత్మాహుతి దాడితో పట్టణంలో పోలీసులు భారీగా మోహరించి, ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

10 died in Suicide Attack at Afghanistan

Comments

comments