Home అంతర్జాతీయ వార్తలు ఆత్మహుతి దాడి:10 మంది జర్నలిస్టుల మృతి

ఆత్మహుతి దాడి:10 మంది జర్నలిస్టుల మృతి

sucide-attack

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. కొద్ది గంటల ముందే ఉగ్రవాదులు రెండు చోట్ల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఈ దాడిలో 10 మంది జర్నలిస్టులతో సహా 31 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదట ఓ ఉగ్రవాది మోటర్ సైకిల్‌పై వచ్చి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ దాడిని కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు సంఘటనాస్థలానికి చేరుకున్న సమయంలో మరో సూసైడ్ బాంబర్ తనకు తానుగా పేల్చివేసుకున్నాడు. దీంతో 10 మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు కాబూల్ పోలీసులు పేర్కొన్నారు.