Home జాతీయ వార్తలు అగ్నిప్రమాదంలో 10మంది మృతి

అగ్నిప్రమాదంలో 10మంది మృతి

FIREశ్రీనగర్ : జమ్మూలోని రాంబాన్ జిల్లాలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక చందర్‌కోటె ప్రాంతంలో కొందరు కూలీలు ఓ శిబిరం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో పది మంది అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.