Search
Wednesday 14 November 2018
  • :
  • :

30 రోజుల్లో 10 లక్షల ఫోన్లు సేల్

Redmiన్యూఢిల్లీ: జియోమీ రెడ్‌మి-4 పోన్ రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకె ళ్తోంది. గత 30 రోజుల్లో 10 లక్షల యూనిట్ల విక్రయాలతో రికార్డును నెల కొల్పింది. చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ జియోమీ తక్కువ, మధ్య స్థాయి రేట్లతో అద్భుతమైన ఫీచర్ల ఫోన్లను తీసుకొచ్చింది. ఈ మొబైళ్లు మార్కెట్‌లో వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. గత నెలలో జియోమీ నుంచి వచ్చిన రెడ్‌మి 4 స్మార్ట్‌ఫోన్ నెల రోజుల్లో 10లక్షల యూని ట్లు సేల్ చేసింది. ఫ్లాష్‌సేల్స్, ప్రీ ఆర్డర్స్ ద్వారా ఈ రికార్డును సాధించినట్లు కంపెనీ తెలిపింది. షియోమీని స్థాపించిన తర్వాత తక్కువ కాలంలో రికార్డు అమ్మకాలు జరిగిన ఫోన్‌గా రెడ్‌మి 4 నిలిచిందని పేర్కొంది. గతేడాది విడుద లైన రెడ్‌మీ 3ఎస్ వేరియంట్లు ఇప్పటివరకూ అత్యధికంగా 40లక్షల యూ నిట్లు విక్రయమవ్వడం విశేషం. రెడ్ మి4 ఫోన్ ప్రత్యేకతలు చూస్తే.. 2 జిబి, 3 జిబి, 4 జిబి ర్యామ్ ఫోన్ ధరలు వరుసగా రూ.6,999, రూ.8,999, రూ.10,999గా ఉన్నాయి. 16 జిబి, 32 జిబి, 64 జిబి అంతర్గత మెమొరీ, బ్యాటరీ సామర్థం అత్యధికంగా 4,100 ఎంఎహెచ్ ఉంది.

Comments

comments