Home జాతీయ వార్తలు ధీరే ధీరే సే పాటకు 10 కోట్ల వ్యూస్

ధీరే ధీరే సే పాటకు 10 కోట్ల వ్యూస్

DHEEREముంబయి : సింగర్, ర్యాపర్ యోయో హనీసింగ్ కంపోజ్ చేసిన ధీరే ధీరే సే … పాట యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. హృతిక్ రోషన్,సోనమ్‌కపూర్ నటించిన ఈ పాటను ఇప్పటి వరకు పది కోట్ల మంది వీక్షించారు. ఈ విషయాన్ని హనీసింగ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 1990లో వచ్చిన ఆషికీ సినిమాలోని ధీరే ధీరే పాటకు సీక్వెల్‌గా హనీసింగ్ ఈ పాటను కంపోజ్ చేశారు. హిందీలో ఇప్పటి వరకు వచ్చిన సింగిల్స్ పది కోట్ల వ్యూస్ దాటిన మొదటి పాట ఇదేనని టీ-సిరీస్ అధినేత, నిర్మాత భూషణ్‌కుమార్ తెలిపారు.