Search
Sunday 18 November 2018
  • :
  • :

ప్రధాని హత్యకు కుట్ర…10మందికి ఉరిశిక్ష

HASINA

ఢాకా: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 10 మందికి ఆ దేశ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో 9 మందికి 20 సంవత్సరాల జైలు శిక్ష, మరోకరికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.  2000 సంత్సరంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం షేక్ హసీనా గోపాల్‌గంజ్‌ జిల్లాలోని ఓ కళాశాల మైదానంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి సభ ఏర్పాటు చేశారు.

కాగా, హసీనా ప్రసంగానికి ఒక రోజు ముందు పోలీసుల తనీఖీల్లో సుమారు 76 కిలోల పేలుడు పదార్థం బయటపడింది. దాంతో హసీనా హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై హర్కత్‌ ఉల్‌ జీహాద్‌ అల్‌ ఇస్లామీ అధ్యక్షుడు ముప్తీ హన్నన్‌తో పాటు 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు బెయిల్ పై విడుదల కాగా, ముఫ్తీ హన్నన్‌ను 2017 ఏప్రిల్‌లో ఉరి తీసిన సంగతి తెలిసిందే.

Comments

comments