Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రూ.10 ప్లాస్టిక్ నోట్లు రానున్నాయ్..

note
న్యూఢిల్లీ: ఐదు పట్టణాల్లో రూ.10 ప్లాస్టిక్ నోటును పరీక్షించనున్నామని ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఐదు నగరాల్లో రూ.10 ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చింది. 10 ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే క్రమంలో క్షేత్రస్థాయిలో కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్‌లలో ట్రయల్ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మహాత్మాగాంధీ సిరీస్‌లో వచ్చిన కొత్త రూ.500 నోటు సైజు 66 ఎంఎం X 150 ఎంఎం ఉండగా, అలాగే రూ.2000 నోట్ల సైజు 66 ఎంఎం X 166 ఎంఎంగా ఉందని చెప్పారు. వీటిని సులభంగా గుర్తించేందుకు రెండు నోట్ల మధ్య 10 ఎంఎం తేడా ఉంటుందని ఆయన సమాధానమిచ్చారు. కాగా రూ.2000 నోటుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. నల్లధనాన్ని నిరోధించే క్రమంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఇలాగే రూ.2వేల నోటును కూడా రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోన ్న నేపథ్యంలో ఆర్థికశాఖ లోక్‌సభలో స్పష్టతనిచ్చింది. రద్దు చేసే ప్రతిపాదనేమీ లేదని చెప్పారు.

Comments

comments