Home జాతీయ వార్తలు అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్లు ?

అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్లు ?

Modiన్యూఢిల్లీ: అగ్రకులాలలోని పేదలకు(ఆర్థికంగా వెనుకబడినవారికి) ఉద్యోగాలు, విద్యా సంస్థలలో ప్రవేశాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల చివరి రోజైన మంగళవారం నాడు ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలపరిమితి మరి కొద్ది నెలల్లో ముగియనున్న తరుణంలో ప్రభుత్వం ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్న కుటుంబాలకు రిజర్వేషన్లు వర్తించేఅవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిమితిని పెంచడానికి రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. అవసరమైతే సమావేశాలను మరో రెండు రోజుల పాటు పొడగించే అవకాశం ఉంది.

10% Reservations for economically weaker in upper castes, Modi govt is likely to bring a bill in Parliament tomorrow