Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

సర్కారీ నోట… ప్రైవేటు పాట

నిబంధనలు బేఖాతర్
ప్రైవేట్ బడుల్లోనే పరీక్ష కేంద్రాలు

EXAMS

మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :  ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు పెంచుతామని ప్రగల్భాలు పలికే అధికారులు ఆచరణలో మాత్రం ప్రైవేట్ పాట పడుతు న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కావలసిన సౌకర్యాలు లేవన్న కుంటిసాకుతో మరోమారు ప్రైవేట్‌కు గులాం గిరీ చేయడానికి సిద్ధం అయ్యారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఏర్పాటు చేయడానికి సంబంధించి ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఆదేశాలు జారీచేసినా జిల్లా యంత్రాంగం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. పరీక్షల నిర్వహణ కేంద్రం డైరెక్టర్ సురేందర్ రెడ్డి గత సంవత్సరం జూన్ 22 ఆర్.సి నెంబర్ 151/బి-2/2017 జారీచేస్తూ జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు సరిపోని పక్షంలో జిల్లాలోని జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఇతర వోకేషనల్ కళాశాలలు, డైట్ కేంద్రాలను ఎంపిక చేసి తుది జాబితాను తమకు నివేదించాలని ఆదేశాలు జారీచేశారు. కాని జిల్లా అధికారులు మాత్రం కుంటిసాకులు చెప్పుతు తప్పించుకుంటున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, హైద్రాబాద్ జిల్లాల పరిధిలోని అధికారులు దాదాపుగా ఇదే విధంగా చేయగా కొన్ని జిల్లాల అధికారులు మాత్రం పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రభుత్వ బడులు అందుబాటులో లేని ప్రాంతంలో ప్రైవేట్ పాఠశాలల వైపు చూశామని అధికారులు చెపుతున్న కొంత మంది యజమాన్యాలను అనుకూలంగా వారి ఆదినంలోని పాఠశాలలను ఎంపిక చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రామీణ మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉన్న ప్రైవేట్ పాఠశాలలను ఎంపిక చేయడం అధికారుల వైఖరీని తెలుపుతుందన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రైవేట్‌తో కుమ్మక్కు …
ప్రభుత్వ పాఠశాలల్లో కాకుండా ప్రైవేట్ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు వేయడం పై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రస్తుతం అయిన వాటిని సరిదిద్దుకోవాలని ఉన్నతాధికారులు ఆలోచన చేసిన క్రిందిస్థాయి అధికారులు మాత్రం తమకు అనుకూలంగా ఉన్నవారికి జై కోడుతు పై అధికారులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఎర్పాటు చేసిన పక్షంలో వారు కొంత మందికి ఆనుకూలంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్దులపై దీని ప్రభావం పెద్దగా ఉంటుందని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రైవేట్ విద్యార్దులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్దులు పోటిపడటం సాద్యం కాదని దానికి తోడు యజమాన్యాలు సైతం తమ విద్యార్దులకు ఆనుకూలంగా వ్యవహరిస్తాయని వారు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ పరీక్ష కేంద్రాల మద్య అంతర్గత ఒప్పందంతో తమ విద్యార్దులకు ఆనుకూలంగా మలుచుకుని ప్రభుత్వ విద్యార్దులను భిన్నంగా చూస్తారని విద్యార్దుల తల్లితండ్రులు గత సంవత్సరం పలు కేంద్రాల వద్ద సైతం బాహటంగానే విమర్శలు చేసిన సందర్బాలు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఆదే స్కూల్ ప్రిన్సిపాల్ చీఫ్ సూపరిండెంట్ ఉంటాడని గవర్నమెంట్ తరపున సూపరిండెంట్‌ను మాత్రమే నియమిస్తారని దీనితో వారు పరీక్ష కేంద్ర సిబ్బందిపై పెత్తనం చేసి ఉపాధ్యాయులపై సైతం వేదించడం లేదా తమకు ఆనుకూలంగా మలుచుకోవడం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ బడులు సరిపోను లేకపోతే ఇంటర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఇతర ప్రభుత్వ ఆనుబంద వాటిని ఎంపిక చేయాలని ఉన్న జిల్లా యంత్రాంగం వాటిని పట్టించుకోకుండా నేరుగా ప్రైవేట్ పాట పాడటం విమర్శలకు తావిస్తుంది.
ప్రభుత్వ పాఠశాలలు లేనందునే : డిఇఓ సత్యనారాయణ రెడ్డి
ప్రభుత్వ పాఠశాలలు సరిపోను లేకపోవడంతోనే ప్రైవేట్ పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశామని రంగారెడ్డి జిల్లా విధ్యాధికారి సత్యనారాయణరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయాలని ప్రభుత్వం సూచించిన మాట వాస్తవమే అయిన వారి ఆనుమతితోనే ప్రైవేట్ పాఠశాలలను గుర్తించినట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో కావలసినన్ని ప్రభుత్వ కేంద్రాలు లేవని, ఉన్న సౌకర్యాల కొరత ఉండటం వలన ప్రైవేట్ పాఠశాలల్లో కేంద్రాలను ఎంపిక చేశామన్నారు.

Comments

comments