Search
Friday 21 September 2018
  • :
  • :

మియాపూర్ లో బాలుడి అదృశ్యం

10-year-old boy goes missing from home at Miyapur

మియాపూర్ : ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మియాపూర్ సాయిబాబా దేవాలయ ప్రక్కన ఉండే బుడిజంగల శాంత కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఆమె కుమారుడు బాలుడు కృష్ణ (10) రెండవ తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 15వ తేదీన ఉదయం 10 గంటలకు స్కూల్‌కు వెళ్తున్నాని ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో తెలిసిన చోట, స్నేహితులు, బంధువుల వద్ద బాలుడి ఆచూకి కోసం గాలించిన లభించకపోవడంతో తల్లి మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Comments

comments