Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

100 కోట్ల బడ్జెట్‌తో త్రివిక్రమ్-సూర్య సినిమా

trivikramటాలీవుడ్ స్టార్ హీరో త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ్ సూపర్‌స్టార్ సూర్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను త్రివిక్రమ్  ఇదివరకే ఖరారు చేశాడు. కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్… నితిన్ హీరోగా చేస్తున్న ‘అ..ఆ’ సినిమాను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు తర్వాత ఆయన బన్నీతో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలిసింది. ఇక హీరో సూర్య ‘24’ సినిమా పనుల్లో మునిగిపోయాడు. దీంతో వీరిద్దరి సినిమా ఎప్పుడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్, సూర్యల సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని, ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నాడని తెలిసింది. ఎస్.రాధాకృష్ణ గతంలో కూడా త్రివిక్రమ్‌తో పలు హిట్ చిత్రాలను నిర్మించాడు. వీరిద్దరి మంచి స్నేహం కూడా ఉంది. దీంతో ఈ సినిమాకు ఆయనే నిర్మాత అని అంటున్నారు.

Comments

comments