Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు!

dangalబాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ మూవీ ‘దంగల్’ ఆశించిన స్థాయిలో రికార్డులు సృష్టిస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన టాక్‌తో సినిమా కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సినిమా వసూళ్లు పెరుగుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజున రూ.29.78 కోట్ల వసూళ్లను సాధించింది. ఆతర్వాత శనివారం నాడు రూ. 34.82 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. ఇక క్రిస్మస్ పండుగ రోజున ఆదివారంనాడైతే ఏకంగా రూ.41.25 కోట్లను వసూలు చేసి చరిత్ర సృష్టించేసింది. మొత్తంగా ఇప్పటివరకు హిందీ, తెలుగు, తమిళ్ వర్షన్‌లు కలిపి రూ.106.95 కోట్లను సాధించింది ‘దంగల్’. రెండో రోజు కంటే ఆదివారం నాటికి 20 శాతం బిజినెస్ పెరగడం విశేషం. ఇది అమీర్‌ఖాన్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది. అయితే ఈ వారంలో సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయా అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే పైరసీ మూవీ నెట్‌లోకి వచ్చేయడం కూడా కలెక్షన్‌లపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంటున్నారు.

Comments

comments