Search
Wednesday 14 November 2018
  • :
  • :

సైనిక విమానం కూలి 257 మంది మృతి (వీడియో)

AIR-CRAFT

అల్జీర్స్ : అల్జీరియాలో బుధవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. 300 మంది సైనిక సిబ్బందితో వెళుతున్న సైనిక విమానం బౌఫారిక్ ఎయిర్‌పోర్టు సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 257 మందికి పైగా సైనికులు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు సమీపంలోని అన్ని రోడ్లను మూసేశారు. బౌఫారిక్ సైనిక ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ విమానం కూలింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.

100 Killed in Military Aircraft Wreck at Algiers

Comments

comments