Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్!

Magadheera

రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. ఎప్పుడో పదేళ్ల కిత్రం వచ్చిన ఈ సినిమాను ఫిక్షన్, జానపదం, యాక్షన్‌తో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమా అన్ని వర్గాలను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్‌చరణ్, కాజల్ జంట ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా యూట్యూబ్‌లో ఓ కొత్త రికార్డును సృష్టించింది. సౌత్ నుంచి హిందీలో డబ్ అయిన మూవీస్‌లో ‘మగధీర’ ఈ రికార్డు సృష్టించడం విశేషం. ఈ సినిమాకు ఇంతవరకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

సాధారణంగా నార్త్‌లో మన సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండదు. కానీ అలాంటిది ఈ సినిమాకు ఈ రేంజ్ వ్యూస్ రావడం మామూలు విషయం కాదు. అంతేకాకుండా ఈ సినిమాకు లక్ష నలభై రెండు వేల లైకులు కూడా లభించాయి. బాహుబలి హిట్ తర్వాత ఉత్తరాది ప్రేక్షకుల దృష్టి సౌత్‌పై పడింది. బాహుబలి తీసిన రాజమౌళి ‘మగధీర’కు సైతం దర్శకత్వం వహించాడనే పాయింట్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే యూ ట్యూబ్‌లో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

Comments

comments