Search
Monday 24 September 2018
  • :
  • :

నిర్భంద తనిఖీలు.. పోలీసుల అదుపులో 100 మంది అనుమానితులు

POLIC-CHECKSహైదరాబాద్: సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన నిర్భంద తనిఖీలలో 100 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో 588 పోలీసులు మీర్‌ఆలం, ముస్తఫానగర్, పహడీషరీఫ్, రాజేంద్రనగర్, చందానగర్, శంషాబాద్, గుల్జర్‌నగర్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు రౌడీషీటర్లతోపాటు 26 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 120 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అంతేగాక తనిఖీలలో గుర్తించిన 12 మంది బాలకార్మికులను పోలీసులు విముక్తి కల్పించారు.

Comments

comments