Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

వందేళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యం

RAPED

లక్నో: సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన ఇది. వందేళ్ల వృద్ధురాలిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడడంతో బాధితురాలు మృతిచెందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ఆదివారం అర్ధరాత్రి యుపిలోని మీరట్ పట్టణ పరిధిలోగల జని అనే గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… స్థానికంగా 100 ఏళ్ల ఓ వృద్ధురాలు తన సొదరుడితో కలిసి నివాసం ఉంటుంది.

అయితే ఆదివారం అర్ధరాత్రి దాటకా ఇదే ప్రాంతంలో నివాసం ఉండే పునియా(25) అనే యువకుడు మద్యం మత్తులో వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో వృద్ధురాలు అరవడం విన్న చుట్టూపక్కల వారు వచ్చి చూసేసరికి నిందితుడు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. దాంతో అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

100-year-old woman allegedly raped by drunk man in Meerut.

Comments

comments