Home జాతీయ వార్తలు వందేళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యం..!

వందేళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యం..!

Rape on 100 Year Old Woman

కోల్ కతా: ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్న కామాంధుల్లో మాత్రం మార్పు రావడంలేదు. వావి వరసలు మర్చిపోయి పసివాళ్ల నుంచి వృద్ధుల వరకు ఎవర్నీ వదలడం లేదు. మృగాళ్ల మారి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇదే కొవలో తాజాగా వెస్ట్ బెంగాల్‌లో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల యువకుడు వందేళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టడం సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నదియా జిల్లాలోని గంగ ప్రసాద్‌పూర్‌కు చెందిన అభిజిత్ అదే ఊరికి చెందిన 100 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. సోమవారం అర్థరాత్రి దాటాక ఆమె ఇంటికి వెళ్లి ముసలావిడపై అత్యాచారానికి యత్నించాడు. దాంతో ఆమె గట్టిగా కేకలు వేసింది.అది విన్న కుటుంబ సభ్యులు వెంటనే బయటకొచ్చి జరిగిన ఘోరాన్ని చూశారు. సదరు యువకుడ్ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.పోలీసులు బాధితురాల్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

100-year-old woman raped by Young man in West Bengal

Telangana Breaking News