Home తాజా వార్తలు భారత్ ఘన ’శతక‘ విజయం..

భారత్ ఘన ’శతక‘ విజయం..

india

రాజ్‌కోట్: భారత్‌-వెస్టిండీస్‌ల మధ్య జరిగిన తొలిటెస్టులో టీమ్‌ఇండియా 272 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విండీస్‌ను అత్యంత చిత్తుగా ఓడించిన భారత్,  ప్రత్యర్థి జట్టుపై భారీ తేడాతో గెలుపొందడం ఇదే తొలిసారి.  విరాట్ కోహ్లీ పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్ గా భాద్యతలు చేపట్టిన నుండి స్వదేశంలో జరిగిన అన్ని సిరీస్‌ల్లోనూ భారత్ ఓటమనేదే లేకుండా విజయాలతో దూసుకుపోతోంది. దీంతో టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని చేరుకుంది. విండీస్‌పై తాజా విజయం స్వదేశంలో భారత్‌కు 100వ టెస్టు విజయం కావడం విశేషం. 266వ టెస్టు మ్యాచ్‌లో  భారత్ ఈ ఫీట్ సాధించింది. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో ‘శతక’ విజయాలు పూర్తి చేసుకున్న‌ 4వ జట్టుగా భారత్ నిలిచింది. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా 238 విజయాలు(415 మ్యాచ్‌ల్లో), రెండో స్థానంలో ఇంగ్లాండ్ 217 విజయాలు(515 టెస్టుల్లో), మూడో స్థానంలో సౌతాఫ్రికా 104 విజయాలు(230 మ్యాచ్‌ల్లో) అత్యధిక విజయాలు సాధించిన జట్లుగా టాప్-3లో ఉన్నాయి.