Search
Wednesday 26 September 2018
  • :
  • :

వారం రోజుల్లో రాష్ట్రంలో 102 సేవలు ప్రారంభం

look

*రాష్ట్రంలో 108 సేవలను విస్తరిస్తాం
*వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా వున్న పోస్టుల భర్తీ
*రాష్ట్రంలో 40 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు
*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చెర్లకొలు లకా్ష్మరెడ్డి

మనతెలంగాణ / కడ్తాల : గర్బిణి స్త్రీల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో 108 మాదిరిగా కొత్తగా 102 అంబులెన్స్ సేవలను ప్రాంరంభిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చెర్లకొలు లకా్ష్మరెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏజేన్సీ ప్రాంతాలలో 40 అంబులేన్స్ వాహనాలను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 102  సేవలను విస్తరించడానికి  మరో 200 అంబులేన్స్ వాహనాలను సిద్దంగా వుంచినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ చేతులమీదిగా వారం రోజుల్లో 102 సేవలను ప్రారంబిస్తామన్నారు. కడ్తాల మండలం మైసిగండి గ్రామంలో రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం కల్వకుర్తి ఎంఎల్‌ఎ చల్లావంశీచంద్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డిలతో మంత్రి లకా్ష్మరెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో వైద్య ఆరోగ్యశాక మంత్రిలకా్ష్మరెడ్డి మాట్లాడుతూ గర్బం దాల్చిన మొదలు ప్రసవం వరకు, చిన్నారుల టికాల వరకు 102 కు ఒక్క ఫోన్‌కాల్ చేస్తే ఇంటివద్ద నుండి ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షల అనంతరం మళ్లి ఇంటివ్దద చేర్చుతుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అధనంగా 108 వాహనాలను విస్తరణలో భాగంగా 145 వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యవాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలలో ఖాళీగా వున్న డాక్టర్లు, సిబ్బంది ఫోస్టుల భర్తీ చేస్తున్నట్లు గత రెండెళ్ళ కాలంగా రాష్ట్రంలో ఖాళీగా వున్న 10 వే పోస్టులను భర్తీకి ప్రక్రియ కోనసాగుతున్నట్లు తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రులలో 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు అన్ని జిల్లాలోని ప్రధాన ఆస్పత్రులలో ఐసియు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పోరేటుకు దీటుగా నూతన పరికాలతోపాటు సౌకర్యాలు పెంచినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నుట్లు పెర్కోన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వ్యాధులు రాకుండా రాష్ట్రంలో తోలిసారిగా ముందుగానే రోగాల నివారణకు అవగాహన కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. తమ గ్రామాలలో ఎవ్వరి ఏ వ్యాధివుందో గుర్తించేందుకు స్క్రినింగ్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు చేప్పారు. స్క్రినింగ్ క్యాంపుల వల్ల ప్రజల్లో అనేక కాన్యర్ బాధితులను గూర్తించి మేరుగైన వైద్యసధుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్క్రినింగ్‌ను విస్తరించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డి.యం.హెచ్.ఓ భాలాజి పవార్, డిఫ్యూటి డి.యం.హెచ్.ఓ అజీమ్, జడ్పీటిసి కండె హరిప్రసాద్ ఎంపిపి తల్లోజు లలిత వెంకటయ్య, సింగల్‌విండో చైర్మన్ జర్పుల దశరథ నాయక్, వై ఎస్ ఎంపిపి నిట్ట నారాయణ ఎంపిటిసి సభ్యుడు అయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ , సర్పంచ్ శేఖర్ గౌడ్ , ఎంపిడిఓ వెంకట్‌రాములు తదితరులు ఉన్నారు.
ఆర్‌ఎంపి వైద్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

 ఆర్‌ఎంపి వైద్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంగళవారం శంషాబాద్ మండల కేంద్రంలో జరిగిన ఆర్‌ఎంపి వైద్యుల సంక్షేమ సదస్సులో ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి అన్నారు.ఆర్‌ఎంపి వైద్యులు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వైద్య సేవాలు అందించాలని సూచించారు. ఆర్‌ఎంపి వైద్యులకు త్వరాలో శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు.వారికి అండగా ఉంటుందన్నారు.ఆర్‌ఎంపి వైద్యులకు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి హమీ ఇచ్చారు.అదే విధంగా ప్రభుత్వం వైద్య సేవాల కోసం అధిక నిధులను మంజూరు చేస్తోంని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్ధానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్,ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments