Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

102 వాహనం ప్రారంభం

102 vehicle start up

మన తెలంగాణ/పెంచికల్‌పేట్ : పెంచికల్‌పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 102 అంబులెన్స్ వాహనం, 108 పాస్ట్‌రెస్పాండెడ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తల్లి బిడ్డల సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 102 అమ్మఒడి అంబులెన్స్  మంజూరు చేయడం జరిగిందన్నారు.  గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చినట్లయితే 102కు ఫోన్ చేస్తే వాహనం ఇంటి వద్దకు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రసవం అనంతరం తిరిగి ఇంటికి తీసుకొస్తుందన్నారు.  102 అమ్మఒడి వాహనం, 108 ఫాస్ట్‌రెస్పాండెడ్ వాహనాలు గర్భిణీ బాలింతలకు ఎంతగానో ఉపయోగపడతాయని , వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోడ్డు సౌకర్యం సరిగా లేని గ్రామాలకు వెళ్లి చికిత్సలు చేసేందుకు  ప్రత్యేకంగా 108 ఫాస్ట్‌రెస్పాండెడ్ వాహనం  ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం అధికారి విజేందర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సతీష్, తెరాస మండల, యువజన అధ్యక్షుడు చౌదరి తిరుపతి, నగునూరి శ్రీనివాస్, డాక్టర్ రాజు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments