Home తాజా వార్తలు వర్షాలతో 1074 మృతి

వర్షాలతో 1074 మృతి

1074 People Died With Rains Across the Country

ఢిల్లీ : ఈ ఏడాది దేశంలో కురిసిన భారీ వర్షాల కారణంగా 1074 మృతి చెందినట్టు కేంద్రహోం శాఖ వెల్లడించింది. ఈ మొత్తం మరణాల్లో ఒక్క కేరళలోనే 443 మంది చనిపోయారు. కర్నాటకలో 166 మంది, యుపిలో 218 మంది, పశ్చిమబెంగాల్‌లో 198, అస్సాంలో 49 మంది మృతి చెందినట్టు కేంద్ర హోంశాఖ నివేదికలో పేర్కొంది. భారీ వర్షాల కారణంగా వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయని, దీంతో 17,14,863 మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని ఆ నివేదికలో అధికారులు పేర్కొన్నారు.