Home తాజా వార్తలు ఈ ఘటనలో108 సిబ్బంది నిజాయతీ

ఈ ఘటనలో108 సిబ్బంది నిజాయతీ

accidentకొత్తకోట: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం మోటార్ సైకిల్ అదుపు తప్పి శాంతన్న అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. 108 సిబ్బంది వివరాల ప్రకారం పెబ్బేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన శాంతయ్య, కొత్తకోట నుండి పెబ్బేరు వైపు వెళ్తుండగా మోటార్ సైకిల్ అదుపు తప్పి పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయని వారు పేర్కొన్నారు. గాయపడ్డ శాంతన్నను 108 అంబులెన్స్ ద్వారా వనపర్తికి తరలించారు.

94వేల రూపాయలను కుమారుడికి అప్పజెప్పిన 108 సిబ్బంది  

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పెబ్బేరు మండలం వెంకటాపురంకు చెందిన శాంతయ్యకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం వనపర్తికి తరలిస్తుండగా 94వేల రూపాయలను గుర్తించారు. శాంతయ్య దగ్గర ఉన్న 94 వేల రూపాయలను శాంతయ్య కుమారిడికి 108 సిబ్బంది అప్పజెప్పారు.