Home తాజా వార్తలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 108 వాహనాలు సీజ్

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 108 వాహనాలు సీజ్

108 Vehicles Seized by Traffic Police in Drunk and Drive in Hyderabad

హైదరాబాద్:  వాహనాలు నడపరాదంటూ పోలీసులు చెబుతున్న మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు మందేసి రోడ్డుపైకి వాహనాలతో వచ్చేస్తున్నారు. దీంతో మందుబాబుల మత్తు దించే పనిలో ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు. గత రాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 108 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అందులో 62 కార్లు, 46 ద్విచక్రవాహనాలు ఉన్నాయి. ఇక ఫిల్మ్ నగర్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ అజీజ్ మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడ్డాడు. అతడి రీడింగ్ 108గా వచ్చింది. ఆయన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, కౌన్సెలింగ్ కు రావాలని సూచించారు.