Home తాజా వార్తలు 108 ఏండ్ల వృద్ధురాలు మృతి…

108 ఏండ్ల వృద్ధురాలు మృతి…

108-old-woman-died

నిజామాబాద్: కోటగిరి మండలం సుద్దులం గ్రామానికి చెందిన మంజుల్‌బాయి (108) అనే శతాధిక వృద్ధురాలు శుక్రవారం మృతిచెందింది. ఆమెకు ఐదుగురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. 12 మంది మనమలు, మనమరాళ్లతో పాటు 9 మంది ముని మనవరాళ్లు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఆమె ఎవరిపై ఆధారపడకుండా తన పనులు తానే చేసుకుంటూ ఆమె బతికిందని కుటుంబ సభ్యులు చెప్పారు. తుదిశ్వాస విడిచే వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడలేదని వారు సూచించారు. మితాహారం తింటూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.