Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ప్రజ్ఞాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : 10మంది మృతి

7People died in Road Accident

సిద్దిపేట : ప్రజ్ఞాపూర్‌లో రాజీవ్ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది చనిపోయారు. రెండు లారీలు,క్వాలీస్, రాజధాని బస్సు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్య చిక్కుకున్న క్వాలీస్‌లో ప్రయాణిస్తున్న 8మంది చనిపోయారు. అదేవిధంగా లారీని ఢీకొని బస్సు బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.  ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సిఎం కెసిఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

10People died in Road Accident

Comments

comments