Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

పదవ తరగతి విద్యార్థుల మెమోలు మాయం

పోస్టల్ నిర్లక్ష్యం వల్ల పాఠశాలకు చేరని మెమోలు
హెడ్ పోస్టాఫీసుకు ఫిర్యాదు చేసిన ప్రధానోపాధ్యాయులు

SSC

మన తెలంగాణ/యాలాల: పోస్టు అధికారుల నిర్లక్ష్యం  మూలంగా పదవ తరగతి విధ్యార్థులకు చేరాల్సిన మెమోలు ఇంత వరకు పాఠశాలకు చేరలేదని మండల పరిధిలోని ముద్దాయిపేట్ ఉన్నత పాఠశాల ప్రాధానోపాధ్యాయులు శివకుమార్ సికిందరాబాద్‌లోని ప్రధాన పోస్టాఫీసులో ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం పదవ తరగతి పరీక్షలను ముద్దాయిపేట ఉన్నత పాఠశాలలో 37 మంది విధ్యార్థులు పరీక్షలు రాశారు.పరీక్షల అనంతరం విధ్యార్థులు తాండూరు పట్టణంలోని వివిధ కళాశాలలో ఇంటర్ చదువులకు వెళ్లారు.అయితె గత ఆరు నెలల క్రితం రావాల్సిన పదవ తరగతి మెమోలు ఇంత వరకు పాఠశాలకు చేరలేదని తెలిపారు.అయితె పోస్టు అధికారుల నిర్లక్షంతో మెమోలు పాఠశాలకు చేరక పోవడంతో ఇంటర్‌లో విధ్యార్ఖులు స్కాలర్ షిప్‌లకు,పరీక్ష ఫీజులకు ధరఖాస్తు చేసుకోలేక పోతున్నారు.దీంతో విధ్యార్థుల తల్లి తండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయునిపై ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిపారు.ఈ విషయాన్ని పలుమార్లు స్థానిక పోస్టు అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని తెలిపారు.ఈ విషయంలో జడ్పి చైర్మన్‌కు,ఎస్‌ఎస్‌సి బోర్డుకు సైతం గతంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.మండల విధ్యాధికారి,జిల్లా విధ్యాధికారికి సైతం చెప్పినట్లు తెలిపారు.అయితె పోస్టల్ అధికారుల తప్పిదం వల్ల ఇంత వరకు పదవ తరగతి మెమోలు పాఠశాలకు చేరలేదని చెప్పారు.వెంటనే పదవ తరగతి మెమోలు ఎక్కడ ఉన్నా వెంటనే పాఠశాలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్లక్షంగా వ్యవహారించిన పోస్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు కోరారు.

Comments

comments