Home తాజా వార్తలు సిరిసిల్లలో 11 కిలోల గంజాయి పట్టివేత

సిరిసిల్లలో 11 కిలోల గంజాయి పట్టివేత

11 Kgs Cannabis seized in Rajanna Siricilla District

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో శుక్రవారం పోలీసులు భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లాకు తరలిస్తున్న 11 కిలోల గంజాయి పట్టుబడింది. ఇద్దరు వ్యక్తులు గంజాయిని ఆటోలో తరలిస్తుండగా సిరిసిల్ల బైపాస్ సమీపంలో సోదాలు నిర్వహిస్తున్నా పోలీసులకు  పట్టుబడ్డారు. పట్టుబడిన నిందితులను పెద్దపల్లి జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని ఆటో ను సీజ్ చేసినట్లు జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే వెల్లడించారు.