Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

చీనాబ్ నదిలో పడిన బస్సు:11 మంది మృతి

bus-Accident

                                             11 Killed In Road Accident In Jammu and Kashmir

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కిష్టోవర్‌లోని టెక్రీ దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 30 మందితో వెళ్తున్న మినీ బస్సు చీనాబ్ నది వద్ద గల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. రెస్య్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఎనిమిది మృతదేహాలను బయటకు తీశారు.  19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Comments

comments