Home జాతీయ వార్తలు రోడ్డు ప్రమాదంలో 11మంది మృతి

రోడ్డు ప్రమాదంలో 11మంది మృతి

BREAKINGమిజోరం : మిజోరంలో శనివారం అర్ధరాత్రిజరిగిన రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది చనిపోయారు. లంగ్లేయ్ జిల్లాలో ఏజ్వాల్ నుంచి లాంగ్‌ట్లాయ్ వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 21మంది తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవర్ బస్సు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.