Home తాజా వార్తలు లోయలో పడిన స్కార్పియో: 11 మంది మృతి

లోయలో పడిన స్కార్పియో: 11 మంది మృతి

Scorpio

సిమ్లా: స్కార్పియో లోయలో పడిన ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కులు జిల్లా రోహ్ తంగ్ లోని రాహ్నీ నాలా ప్రాంతంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.  స్కార్పియో అదుపు తప్పి లోయలో పడడంతో 11 మంది ఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పురుషులు, ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను లోయలో నుంచి బయటకు తీశారు.  మృతులను పాంగీ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు మనాలీ నుంచి పాంగీకి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.