Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

చీనాబ్ నదిలో పడిన బస్సు : 11మంది మృతి

11 People died with Bus Fell in Chenab River

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మాచెల్ మాతా దర్శనానికి వెళుతున్న భక్తుల బస్సు అదుపు తప్పి చీనాబ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11మంది చనిపోయారు. ఐదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. నది నుంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతుల వివరాలు తెలుసుకుంటున్నట్టు పోలీసులు వెల్లడించారు.

11 People died with Bus Fell in Chenab River

Comments

comments