Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఆరుగురు ఉరి వల్లే మరణించారు

11 People Suspected Dies in Burari In New Delhi

న్యూఢిల్లీ: నగరంలో బురారీ ప్రాంతంలో 11 మంది అనుమానస్పందగా  మృతి చెందిన ఘటనలో పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది.  ఈ నివేదిక ప్రకారం చనిపోయిన వారిలో ఆరుగురు ఉరి వల్లే మరణించారని వెల్లడైంది. ఈ 11 మందిలో 10 మంది పై కప్పుకు వేలాడుతూ కనిపించగా, వృద్ధురాలి మృతదేహం నేలపై పడి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మరణాలు ఎలా సంభవించాయనే అంశంపై  పోలీసులు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు. అందరూ సామూహికంగా ఆత్మహత్యకు  పాల్పడ్డారా? లేదంటే ఎవరైనా చంపేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో పోలీసులకు వారి ఇంటిలో కొన్ని కీలక పత్రాలు  లభ్యమయ్యాయి. మూఢ విశ్వాసాలతో  మోక్షం కోసం వీరు చనిపోయినట్లు ఆ పత్రాలను పరిశీలించిన పోలీసులు తెలిపారు. దేవుడు  తమను కాపాడుతాడని వారు నమ్మినట్లు ఆ పత్రాల్లో ఉందని పోలీసులు వెల్లడించారు.ఈ కుటుంబ సభ్యులు దేవుడిని బాగా నమ్ముతారని, రోజుకు మూడు సార్లు పూజలు చేస్తారని పొరుగున ఉన్న వారు చెబుతున్నారు. మృతులకు ఈరోజు దిల్లీలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Comments

comments