Home అంతర్జాతీయ వార్తలు 11మంది సౌదీ రాకుమారులు అరెస్ట్

11మంది సౌదీ రాకుమారులు అరెస్ట్

RAJULU

దుబాయ్ : సౌదీ అరేబియాలో రాజ వంశానికి చెందిన 11 మంది రాకుమారులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సౌదీ రాజుకు చెందిన ఓ రాజభవనం ఎదుట వీరు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ కుటుంబానికి చెందిన భద్రత బలగాలు వారిని అరెస్ట్ చేసినట్టు న్యూస్ ఏజెన్సీ తెలిపింది. తమ బంధువుకు సంబంధించిన ఓ కేసు తీర్పులో పరిహారం చెల్లించాలని, రాజ వంశీయుల నీటి, విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లించడాన్ని రద్దు చేస్తూ రాజు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన 11మంది రాకుమారులను అత్యంత భద్రత ఉండే హైర్ జైలుకు తరలించారు. రాకుమారుల అరెస్ట్‌తో దేశ వ్యాప్తంగా భారీ భద్రత పెంచారు.

 11 Saudi Princes Arrest