Search
Wednesday 26 September 2018
  • :
  • :

బల్దియా స్థాయీసంఘం ఎన్నికలు

ghmc11టిఆర్‌ఎస్ కార్పొరేటర్ల పోటాపోటీ
నామినేషన్లు
15 పదవులకు 46 నామినేషన్లు
టిఆర్‌ఎస్ 40, ఎంఐఎం 6
వచ్చేనెల 2న నామినేషన్ల ఉపసంహరణ
మన తెలంగాణ/సిటీబ్యూరో :బల్దియా స్థాయీసంఘం ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. స్థాయీసంఘం పదవుల కోసం టిఆర్‌ఎస్ లో పోటీ తీవ్రంగా నెలకొంది. టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. 15 స్థాయీసంఘం పదవులకుగాను మొత్తం 46 నామి నేషన్లు దాఖలు చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ నుంచే 40 నామినేషన్లు వచ్చాయి. ఎంఐఎం నుంచి 6 నామినే షన్లు దాఖలయ్యాయి. అయితే ఎంఐఎంతో లోపాయి కారి ఒప్పందం ఉండటంతో స్థాయీసంఘం పదవుల ను ఇవ్వాలని టిఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించింది. దీంతో టిఆర్‌ఎస్‌లో మరింత పోటీనెలకొంది. మహా నగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) స్థాయీ సంఘం ఎన్నికల నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగి సింది. వచ్చేనెల 2వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ తుదిగడువు ముగియనుంది. 46 నామినేషన్లు దాఖలయ్యాయి. టిఆర్‌ఎస్ నుంచే 40 మంది కార్పొరేటర్లు స్థాయీ సంఘం పదవుల కోసం పోటీపడుతున్నారు. శుక్ర వారం చివరిరోజు అధిక సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. ఎంఐఎం కార్పొరేటర్లు కూడా చాలామంది శుక్రవారమే నామినేషన్లు దాఖలు చేశారు. ఎంఐఎం తమకు ఆరు స్థాయీసంఘం పదవులు కావాలని టిఆర్‌ఎస్ ముఖ్యనాయకులను కోరినట్లు తెలిసింది. ఎంఐఎంకు ఆరు పదవులు కేటాయిస్తే ఇక తొమ్మిది మాత్రమే మిగులుతాయి. నామినేషన్లు దాఖలు చేసిన టిఆర్‌ఎస్ కార్పొరేటర్లలో 31 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో అధిక సంఖ్యలో రెండు పర్యాయాలు కార్పొరేటర్లుగా గెలుపొందిన వారు ఉండటం విశేషం. టిఆర్‌ఎస్ గ్రేటర్ కౌన్సిల్‌లో స్థాయీసంఘం పదవులు చిచ్చురేపినట్లైంది. నామినేషన్లు దాఖలు చేసిన కార్పొరేటర్లు తమకు స్థాయీసంఘంలో అవకాశం కల్పించాలని మేయర్ బొంతు రామ్మోహన్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. టిఆర్‌ఎస్ అధిష్టానం రంగంలోకి దిగితే తప్పా పరిస్థితి దారిలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 15 మంది కంటే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. కేవలం 15 మంది మాత్రమే బరిలో ఉంటే ఎన్నికలు ఏకగ్రీవమైనట్లుగా ప్రకటిస్తారు. ఎవరు బరిలో ఉంటారో ఎవరు తప్పుకుంటారనే విషయం వచ్చేనెల 2వ తేదీతో తేలిపోనుంది.

Comments

comments