Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

నల్లబజారులో 1120 లీటర్ల పిడిఎస్ కిరోసిన్

1120 liters of PDS kerosene in black market

ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు

మనతెలంగాణ/కరీంనగర్‌: పేద ప్రజల అవసరాల కో సం ప్రభుత్వం పంపిణీ చేసే పి.డి.ఎస్ కిరోసిన్ నల్లబజారు కు తరలివెళుతుంది.పలువురు ఆవకాశవాదులు ప్రభుత్వం సరఫరా చేస్తున్న కిరోసిన్‌ను ఎక్కువ ధరకు నల్లబజారులో విక్రయిస్తున్నారు. అదేరీతిలో ముగ్గురు అవకాశవాదులు 1120 లీటర్ల కిరోసిన్‌ను నల్లబజారులో విక్రయించేందుకు సిద్దం చేయగా సమాచారం అందుకున్న కరీంనగర్ వన్‌టౌ న్ పోలీసులు గురువారం దాడిచేసి పట్టుకుని ముగ్గురి మీ ద కేసు నమోదు చేశారు. కరీంనగర్ వన్‌టౌన్ సిఐ తుల శ్రీనివాస్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ముకరంపుర ప్రాంతానికిచెందిన నయీమాబేగం, బో యవాడకు చెందిన రాచర్ల విజయ్‌కుమార్,జగిత్యాల జిల్లా పె గడపల్లి మండలంలోని ఐతుపల్లి గ్రామానికి చెందిన గాలి ప్రసాద్‌లు వివిధ ప్రాంతాల నుండి సేకరించిన పిడిఎస్ కిరోసిన్‌ను నగరంలోని ముకరంపురలోని ఒక ఇంట్లో నిల్వచేశారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారంపై నిఘాపెట్టిన కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు ఎస్.ఐ ఎం. సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో దా డి చేసి 1120 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 32 ప్లాస్టిక్‌క్యాన్‌లు పోలీసులు స్వాధీనం చేసుకోగా ఒక్కో ప్లాస్టిక్ క్యాన్‌లో 35లీటర్ల కిరోసిన్ ఉంటుందని సిఐ తుల శ్రీనివాస్‌రావు తెలిపారు.
తాము స్వాధీనం చేసుకున్న కిరోసిన్ విలువ రూ.50వేలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి రి మాండ్‌కు తరలించగా అక్రమంగా కిరోసిన్ నిల్వల గుట్టురట్టు చేసిన కరీంనగర్ వన్‌టౌన్ ఎస్.ఐ యం.సురేందర్‌ను, కానిస్టేబుళ్ళు బి.శంకర్, ఆర్.సృజన్, బి.జంపన్నల ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.

Comments

comments