Home జాతీయ వార్తలు 113 మంది ఉగ్రవాదులు హతం

113 మంది ఉగ్రవాదులు హతం

Kishan Reddyఢిల్లీ : ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ 16వ తేదీ వరకు జమ్మూకశ్మీర్‌లో 113 మంది ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన  లోక్‌సభలో మాట్లాడారు. ఈ ఆరు నెలల కాలంలో 18 మంది సాధారణ పౌరులు కూడా మృతి చెందినట్టు ఆయన వెల్లడించారు. 2016 నుంచి ఇప్పటి వరకు మొత్తం 733 మంది ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ అయ్యారని,   2014 నుంచి ఇప్పటి వరకు ఉగ్ర దాడులు మూడింతలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. 2014లో 222 ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయని,  2018లో ఆ సంఖ్య 614కు చేరిందని కిషన్‌ రెడ్డి చెప్పారు. 2018లో 257 మంది ఉగ్రవాదులు, 2017లో 213 మంది, 2016లో 150 మంది ఉగ్రవాదులు భద్రతాబలగాల కాల్పుల్లో హతమయ్యారని ఆయన వెల్లడించారు.

113 Terrorists Encounter In Jammukshmir