Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

1149 రైతు ఆత్మహత్యలు

frmr

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఏడాది ఆగస్టు వరకు నిజంగా వ్యవసాయ రీత్యా 1149 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఇందులో 846 కుటుంబాలకు నష్ట పరిహారం అందించింది. మరో 303 కుటుంబాలకు సంబంధించి కూడా దాదాపు పరిహారం చెల్లింపులు పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2వ తేదీ నుంచి ఆగస్టు 2017 వరకు మొత్తం 2066 కేసులు రైతు ఆత్మహత్యలుగా నమోదయ్యాయి.
ఇందులో అధికంగా కరీంనగర్‌లో 281, వరంగల్ అర్బన్‌లో 260, నల్లగొండలో 186, వికారాబాద్‌లో 146, సంగారెడ్డిలో 144, ఆదిలాబాద్, రంగారెడ్డిలలో 125, నిజామాబాద్‌లో 101 కేసులు ఉండగా కామారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మొత్తం నమోదైన వాటిలో 1808 కేసులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారించి, 1149 మందివి నిజమైన అన్నదాత ఆత్మహత్యలుగానిర్ధారించింది. త్రిసభ్య కమిటీలో రెవిన్యూ, వ్యవసాయ, పోలీసు అధికారి ఉంటారు. పరిహారాన్ని 2016 మే నెలలో 389 కుటుంబాలకు, అక్టోబర్ 2017లో 457 కుటుంబాలకు చెల్లించారు. ఇందులో కొన్ని కేసులకు రూ. 6 లక్షల, మరికొన్నింటికి రూ.1.50 లక్షల చొప్పున ఇచ్చారు.రైతు ఆత్మహత్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. త్రిసభ్య కమిటీ విచారణ పేరుతో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను తగ్గిస్తున్నారని ఆరోపిస్తోన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 4 వేల వరకు అన్నదాతలు వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేకే చనిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు. గడిచిన ఏడాది జాతీయ నేర విభాగ నివేదిక ప్రకారమే మూడు వేల పైన ఆత్మహత్యలతో దేశంలోనే రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని పేర్కొంటున్నారు.

2016 ఏప్రిల్ 2017 ఆగస్టులోపు 872 కేసులు

రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఆత్మహత్య కేసులను పరిశీలిస్తే 2016 ఏప్రిల్ నుండి 2017 ఆగస్టు వరకు కేవలం 17 నెలల కాలంలోనే 872 రైతు ఆత్మహత్యల కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తరువాత కూడా ఈ సంఖ్య పెరగడంపై ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అన్నదాతల ఆత్మహత్యల పాపం గత పాలకులదేనని అంటున్నారని, ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ల తరువాత కూడా ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్న విషయం వారి లెక్కలే చెబుతున్నాయని   రైతు సంఘాలు పేర్కొన్నారు.

Comments

comments