Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఆకట్టుకుంటున్నఅరుదైన 12 ఫీట్ల మొక్కజొన్న..!

Hybrid-Maize

మనతెలంగాణ / కమాన్‌పూర్: మండల కేంద్రం పరిధిలోని న్యూ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రిటైర్డు సింగరేణి కార్మికుడు చిప్పకుర్తి శంకరయ్య తన ఇంటి ఆవరణలో నాటిన మొక్కజొన్న పైరు కాస్తా 12 ఫీట్ల వరకు పోడవు పెరిగి ఆకట్టుకుంటున్నది. సాధారణంగా 6 నుంచి 7 ఫీట్ల ఎత్తు మాత్రమే పెరిగే మొక్కజోన్న ఫైరు శంకరయ్య ఇంటి ఆవరణలో ఏకంగా 12 ఫీట్ల వరకు పెరగడం విశేషం. కాగా జనుపరమైన సమస్యల వల్లే మొక్క జొన్న పైరు 12మీటర్ల పొడువు పెరిగిందని మండల వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. సాధారణ ఎత్తు కన్నా రెండింతలు పెరిగిన ఈ పైరు వల్ల ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. కాగా ఈ మొక్కజొన్న పైరును చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

Comments

comments