Home తాజా వార్తలు ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్: 12 మంది మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్: 12 మంది మావోలు మృతి

Encounter

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. నారాయన్‌పూర్ జిల్లా అకాబీడాలో మావోయిస్టులు సమావేశమయ్యారు. 50 మందిపైగా మావోయిస్టులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.  మావోయిస్టుల సమావేశం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు కూడా పోలీసులపై ఎదురు కాల్పులకు పాల్పడినట్లు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.