అజ్మీర్: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ట్రక్కు ని ఢీకొట్టిన ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో 21మందికి త్రీవ గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే.. స్థానికుల తెలిపిన ప్రకారం.. రాష్ట్రంలోని అజ్మీర్ లో ఆదివారం మధ్యాహ్నం వేగంగా వస్తున్న బస్సు ట్రక్కు ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.