Search
Friday 16 November 2018
  • :
  • :

ఆహార భద్రత కార్డులకు భరోసా!

12 thousand applications for ration cards in the district

క్షేత్రస్థాయిలో వేగవంతమైన విచారణ ప్రక్రియ
జిల్లాలో రేషన్‌కార్డుల కోసం 12వేల దరఖాస్తులు
ఆగస్టు15 నుంచి పంపిణీకి అధికారుల కసరత్తు

తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం చేపడు తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పరం పర కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రగతి భవన్‌లో అహర్ని శలు ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక పథకాలకు శ్రీకారం చుడుతూ అన్ని వర్గాల ఆలోచనల మేరకు రూపకల్పన చేస్తూ అమలు చేస్తున్న ప్రభుత్వం జిల్లాలో ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు ఇక రేషన్‌కార్డులు అందించేందుకు సమా యత్తమవుతోంది. ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కూడా ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.

మన తెలంగాణ/నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పరంపర కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్‌రావు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రగతిభవన్‌లో అహర్నిశలు ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనేకానేక పథకాలను శ్రీకారం చుడుతూ అన్ని వర్గాల ఆలోచనల మేరకు రూపకల్పన చేస్తూ అమలు చేస్తున్న ప్రభుత్వం జిల్లాలో ఎన్నో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు ఇక రేషన్‌కార్డులు అందించేందుకు సమాయత్తమవుతోంది. చాలా సంవత్సరాలుగా ఇప్పటివరకు రేషన్ కార్డులు లేక ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి ప్రయోజనాలకు దూరంగా ఉంటూ వస్తున్న కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు ఆహారభద్రత కార్డులు అందించేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే పూర్తి చేసింది. ఎప్పటినుంచో అందిరికి అందుబాటులో ఉన్న రేషన్‌కార్డులు అందించే ప్రక్రియకు దూరంగా ఉన్న బీపీఎల్ కుటుంబాలు వివిధ కారణాలతో పొందలేని వారి కష్టాలు ఇక తీరనున్నాయి. బడుగు, బలహీనవర్గాలకు బరోసా ఇచ్చేందుకు కేసీఆర్ తక్షణమే క్షేత్రస్థాయికి ప్రక్రియ ముగించి వచ్చే ఆగస్టు 15 నాటికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో జిల్లా పౌరసరఫరా శాఖ, రెవిన్యూ అధికార యంత్రాంగం అర్హులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసింది. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించారు. కార్డుల పంపిణీకి సమయం లేకపోవడంతో లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారాన్ని కూడా జిల్లా పౌరసరఫరా అధికారికి అప్పగించడంతో ఈ ప్రక్రియ కూడా వేగవంతంగా ముందుకు సాగుతోంది.
500 దరఖాస్తులకు ఆమోదముద్ర : జిల్లాలోని 31 మండలాల్లో మొత్తం 991 రేషన్‌దుకాలున్నాయి. వీటిలో మొత్తం 4,49,528 రేషన్‌కార్డులు ఉన్నాయి. వాటిలో 4,20,543 ఆహారభద్రత కార్డులు. 28,912 అంత్యోదయ కార్డులు, 73 అన్నపూర్ణ కార్డులున్నాయి. కొత్తగా రేషన్‌కార్డుల కోసం జిల్లాలో 12వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 11వేల 500దరఖాస్తులు తహసీల్దార్, ఆర్‌ఐల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 500 దరఖాస్తులకు ఆమోదముద్ర లభించింది.
పంద్రాగస్టు నుంచి పంపిణీ : ఇప్పటి వరకు రేషన్‌కార్డులకు సంబంధించిన ప్రక్రియ నత్తనడకన సాగింది. ఆగస్టు 15న కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కూడా ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. దాదాపు 17 రోజుల్లోపే క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించడంతో పాటు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. మొత్తం 12వేల దరఖాస్తుల్లో.. ఇంకా 11,500దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. నల్లగొండలో 300, మిర్యాలగూడలో 200 చొప్పున ఆయా మండలాలకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు పౌరసరఫరాల శాఖకు చేరుకొని ఆమోద ముద్ర కూడా వేసుకొని పంపిణీకి సిద్దంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులను అందజేయాలని లక్షంగా పెట్టుకొని ఆ దిశగా రెవిన్యూ అధికారులు పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే డీఎస్‌ఓకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. రేషన్‌కార్డుల దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేసే బాధ్యతలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి అప్పగించడంతో ప్రక్రియ వేగం పుంజుకుంది. క్షేత్రస్థాయిలో వీఆర్వోలు పరిశీలించిన తర్వాత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పరిశీలించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆప్‌లోడ్ చేసిన తర్వాత దరఖాస్తులను తహసీల్దార్, డీసీఓ పరిశీలిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ పౌర సరఫరాల శాక కమిషనర్ కార్యాలయంలో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. కమిషనర్ కార్యాలయానికి ఆన్‌లైన్‌తో పాటు మాన్యువల్‌గా కూడా దరఖాస్తులు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రెంటింటిని పరిశీలించిన హైదరాబాద్ పౌరసరఫరాల శాఖ అధికారులు ఆమోదముద్ర వేస్తారు. ఆ తర్వాత లబ్ధిదారులకు రేషన్‌కార్డులను అందజేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి చాలా సమయం పట్టేలా ఉండటంతో దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదా రులను ఎంపిక చేసే బాధ్యతను జిల్లాస్థాయిలో డీసీఎస్‌వోకు అప్పగించారు.
ఆగస్టు 15 నుంచి పంపిణీ : డిఎస్‌ఒ
రేషన్‌కార్డులను ఆగస్టు 15వ తేదీన పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది. దరఖాస్తులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తున్నారు. ఇది పూర్తికాగానే జిల్లా కార్యాలయానికి అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాం. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తాం.

Comments

comments