Home జాతీయ వార్తలు చిన్నారిని హత్య చేసిన బాలుడు

చిన్నారిని హత్య చేసిన బాలుడు

Rape

గ్రేటర్ నోయిడా: నోయిడాకు సమీపంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారిని 12 ఏళ్ల కుర్రాడు దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆ పాపని బాలుడు గ్రామశివారుకు తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ చిన్నారి కేకలు వేయడంతో అక్కడున్న రాళ్లతో కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక చిన్నారి అక్కడే తనువు చాలించింది.  చిన్నారి కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయట పడింది. సిసిటివి ఫుటేజీ ఆధారంగా కేసును పరిశీలించన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని ఆరాతీశారు దీంతో తానే ఈ నేరాన్ని చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు.  నిందితుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. అయితే ఈ బాలుడు నిత్యం ఫోన్లో నీలిచిత్రాలు చూస్తుండేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆ నేపథ్యలోనే రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.