Home జోగులాంబ గద్వాల్ డిసిఎం బోల్తా… 120 గొర్రెలు మృతి

డిసిఎం బోల్తా… 120 గొర్రెలు మృతి

DCM-Rollover

జోగులాంబ గద్వాల: జిల్లా ఇటిక్యాల మండలంలోని జింకలపల్లి గ్రామ సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. 150 గొర్రెలను తరలిస్తున్న డిసిఎం జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 120 గొర్రెలు మృతి చెందాయి. అలాగే డిసిఎం డ్రైవర్, క్లీనర్ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కాగా, మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. డిసిఎం తిరుపల్లి గట్టు నుండి అనంతపురం జిల్లాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.