Home నవ విజ్ఞానం విశ్వంలో 13.5 బిలియన్ ఏళ్ల నాటి ప్రాచీన నక్షత్రం

విశ్వంలో 13.5 బిలియన్ ఏళ్ల నాటి ప్రాచీన నక్షత్రం

13.5 billion year old star was born just after the Big Bang

విశ్వంలో అతి ప్రాచీన కాలం నాటి నక్షత్రాల్లో ఒకటైన  13.5 బిలియన్ సంవత్సరాల వయస్సు కలిగిన నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన గలిగారు. ఈ నక్షత్రం అంతా బిగ్‌బ్యాంగ్ పుక్కిలించిన పదార్ధాలతోనే నిండి ఉంది. చిన్న నక్షత్రాన్ని కనుగొనడమంటే చాలా నక్షత్రాలు తక్కువ ద్రవ్య రాశి తక్కువ లోహ తత్వంతో ఉన్నాయని అర్థం చేసుకోవాలని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బహుశా వీటిలో కొన్ని విశ్వం  ఆవిర్భావ కాలం నాటి మొదటి నక్షత్రాలు అయి ఉండవచ్చు. ఇప్పుడు కనుగొన్న నక్షత్రం మిగతా నక్షత్రాల మాదిరి కాకుండా తక్కువ లోహ తత్వంతో  ఉంది. ఇది పాలపుంత లోని పలుచని గుండ్రని బిళ్ల లోని భాగంగా భావిస్తున్నారు. గురుత్వాకర్షణ శక్తి కలిగిన పాలపుంత పొరుగునున్న నక్షత్రాల వ్యవస్థ ఇదివరకు అనుకున్న దాని కన్నా మూడు బిలియన్ సంవత్సరాల వయసు పెద్దదని అనుకుంటున్నారు.

10 మిలియన్ నక్షత్రాలలో ఇదొకటి కావచ్చని మొట్టమొదట ఏర్పడిన నక్షత్రాల గురించి చాలా ముఖ్యమైన సమాచారం దీనివల్ల తెలుస్తుందని పరిశోధకులు కెవిన్ స్కవుఫ్‌మన్ పేర్కొన్నారు. బిగ్‌బ్యాంగ్ తరువాత విశ్వంకు చెందిన మొదటి నక్షత్రాలు హైడ్రొజన్, హీలియమ్, స్వల్ప మొత్తాల లిధియమ్ వంటి మూలకాలతో నిండి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ నక్షత్రాలు హీలియమ్ కన్నా భారమైన మూలకాలను ఉత్పత్తి చేసి ఉండవచ్చని అవి సూపర్‌నోవాగా పెల్లుబికిన తరువాత వాటి ఆధారం గానే విశ్వాన్ని సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.  ఇప్పుడు కొత్తగా కనుగొన్న నక్షత్ర వ్యవస్థ గుండ్రని కక్షలో పాలపుంత చుట్టూ పరిభ్రమిస్తోంది. పాలపుంతకు ఇది  చాలా దూరంలో లేదు. ఈ నక్షత్రం తక్కువ లోహతత్వం కలిగి ఉండడం  విశ్వకుటుంబ వృక్షంలో ఇది బిగ్‌బ్యాంగ్ నుంచి తొలగించ బడిన చాలా చిన్నపాటి తరంగా అంచనా వేయడమవుతోంది. బుధ గ్రహంలో భారీగా ఉండే మూలకాలు ఈ నక్షత్రంలో కూడా చిన్నమొత్తంలో ఉండడం ఒక రికార్డుగా చెప్పవచ్చు.

ఈ నక్షత్రం రెండు నక్షత్రాల వ్యవస్థలో ఒక భాగం. ఇది మామాలుగా భ్రమిస్తుంటుంది. 1990 లో పరిశోధకులు నక్షత్రాల సమూహాలు విశ్వం మొదటి దశలో ఏర్పడి ఉండవచ్చని, అవి పరిశీలించడానికి వీలుకానివని, ఎందుకంటే అవి తమ ఇంధనం ద్వారా మండి తరువాత , వేగంగా అంతరించి పోతుంటాయని అనుకునే వారు. ఏదెలాగున్నా ఖగోళ సంబంధ అంశాలు చాలా అసహజంగా ఉంటాయి.   ఆ కాలం నాటి నక్షత్రం తక్కువ ద్రవ్యరాశితో ఉన్నప్పటికీ బిగ్‌బ్యాంగ్ నుంచి వెలువడి 13 బిలియన్ సంవత్సరాలు దాటినప్పటికీ మనగలుగుతాయి. భారీ నక్షత్రాలకు విరుద్ధంగా తక్కువ ద్రవ్యరాశి కలిగిన నక్షత్రాలు కూడా సుదీర్ఘకాలం మనుగడ సాగిస్తాయి. ఎర్రని మరుగుజ్జు నక్షత్రాలు  సూర్యుని ద్రవ్యరాశిలో చిన్న భాగాలైనా త్రిలియన్ సంవత్సరాల పాటు మనుగడ సాగిస్తాయని భావిస్తున్నారు.  ఈ కొత్త పరిశోధన వల్ల ప్రాచీన నక్షత్రాలను కూడా పరిశోధించే సాధ్యం ఏర్పడింది.

                                                                                                                                                                                              – సైన్స్ విభాగం

13.5 billion year old star was born just after the Big Bang

Telangana Latest News