Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు : 13 మంది మృతి

Uttarpradesh-Rainsలక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరపి లేకుండా వర్షాల కారణంగా గడిచిన 24 గంటల్లో 13 మంది మృతి చెందారు. మంగళవారం భారీ వర్షానికి రాష్ట్రంలోని పలు ప్రదేశాలు నీట మునిగాయి. వరద తాకిడికి చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… భారీ వర్షాల కారణంగా మంగళవారం లక్నోలోని రాయ్‌బరేలీ గ్రామంలో ఓ ఇల్లు కూలి ఆరుగురు చనిపోగా, ఖురేహతి, తెధ్వాచిల్లాలా గ్రామాలలో పిడుగుపాటుకి నలుగురు, మరో చోట ఇల్లు ధ్వంసం కావడంతో మరో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

Comments

comments