Search
Saturday 17 November 2018
  • :
  • :

స్పెయిన్‌లో ఉగ్రదాడి, 13మంది దుర్మరణం

వ్యానుతో ఢీకొట్టి ఉగ్రవాదుల ఘాతుకం

Spain-Terrorబార్సిలోనా: స్పెయిన్‌లోని ప్రఖ్యాత నగరం బార్సిలోనాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. వ్యానుతో పాదచారులను ఢీ కొట్టించి 13మందిని పొట్టనబెట్టుకున్నారు. గురువారంనాడు జరిగిన ఈ ఘటనలో మరో 20మంది తీవ్ర గాయాలపాల య్యారు. ఇక్కడ వేసవి కాలం కావడంతో టూరిస్టులు బార్సిలోనాకు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఉగ్రవాదులు ప్రధానంగా పర్యాటకులనే లక్షంగా చేసుకున్నట్టు కనిపిస్తోందని స్పెయిన్ అధికారిక రేడియో వెల్లడించింది. వ్యానుతో ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదులు అనంతరం సమీపంలోని రెస్టారెంట్‌లోకి చొరబడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దగ్గరలోని షాపులు, రెస్టారెంట్లను మూసి వేసి సహాయక చర్యలకు పూనుకున్నాయి. మరోవైపు ప్రత్యేక బలగాలు ఉగ్రవాదుల ఏరివేతకు నడుంకట్టాయి.

Comments

comments