Search
Saturday 22 September 2018
  • :
  • :

విషపు గడ్డి తిని 14 గేదెల మృతి

Buffalo

బోనకల్:   విషపు గడ్డి తిని 14 గేదెలు మృతి చెందాయి. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం బోనకల్‌కు చెందిన తండా వాసుల గేదెలు ప్రతిరోజు మేతకు తోలుకుని వెళ్లే వారు. ముష్టికుంట్ల- బోనకల్ ప్రధాన రహదారి వెంట చిరునోములకు చెందిన
రైతు పొలం గతంలో గాడు గడ్డి చల్లగా, ప్రస్తుతం వేసవికాలం కావటంతో అది ఎండిపోయిందని అలా వదిలేశారు. ఆ గడ్డిని తిన్న గేదెలు వెంటనే రహదారి వెంట ఒక్కొక్కటిగా పడి చనిపోయారు. ఆ ఇగురును నమూ అంటారని, దానిని ముదిరే వరకు తిన కూడదని, అది తినటం వలననే గేదెలు చనిపోయాయని స్థానికులు గోపాల మిత్ర కొండలరావుతెలిపారు.

అవి తినగానే గొంతులో పట్టుకుని శ్వాస ఆడక చనిపోతాయని, ఆ నాములో మైమోషిన్ అనే విష పదార్దం ఉంటుందని, దాని వలన గ్యాస్ పామ్ అయి శరీరమంతా విషంగా మారి గేదెలు చనిపోతాయని తెలిపారు. తండాకు చెందిన భూక్యా చిట్టెమ్మకు చెందిన మూడు గేదెలు, భూక్యా వెంకటేశ్వర్లుకు 4గేదెలు, భూక్యా బుచ్చి, గుగులోతు మాణిక్య, బాణోతు వాసు, భూక్యా సామ్య, భూక్యా శ్రీను ఒక్కొక్కరి తల గేదెల చొప్పున తల 18గేదెలు తినగా వెంటనే 14 గేదెలు అక్కడికక్కడే చనిపోయాయి. మిగితా నాలుగు గేదెలు కొట్టుమిట్టాడుతున్నాయి. బాధిత కుటుంబాల వారు ప్రధాన వృత్తి ఆదాయ వనరులైన గేదెలు చనిపోవటం వాళ్లంతా కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.

Comments

comments